HomeTelugu Trendingఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

6a
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పర్యటించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిగూడేనికి ర్యాలీగా వెళ్లారు చిరంజీవి. మార్గమధ్యంలో కొన్ని చోట్ల రోడ్ షో నిర్వహించారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌, కె.యన్.రోడ్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ విగ్రహాన్ని గతంలోనే ఆవిష్కరించాలని తొలుత భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. 120 మంది పోలీసు సిబ్బందితో చిరుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించారు. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంత్, ఈలి నానిలు చిరంజీవికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లను చేశారు.

కృష్ణాజిల్లా నూజివీడులో పుట్టిన ఎస్వీఆర్‌.. మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నప్పుడే నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయ్యాక ఫైర్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో ‘వరూధిని’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు రాలేదు. ఆపై కొన్ని రోజులు ఓ సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu