HomeTelugu Newsదేవదాస్‌ టీజర్‌కి టైమ్‌ వచ్చేసింది

దేవదాస్‌ టీజర్‌కి టైమ్‌ వచ్చేసింది

ఈ మధ్యకాలంలో మల్టిస్టారర్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో రాబోతోన్న ‘దేవదాస్‌’ చిత్రం రాబోతుంది. నాటి క్లాసికల్‌ హిట్‌ మూవీ దేవదాస్‌ టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

3 25

కాగా ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డాన్‌గా దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. రేపు సాయంత్రం 5 గంటలకు సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. స్మాల్‌ పెగ్‌ లాంటి టీజర్‌తో రేపు సాయంత్రం ఐదు గంటలకు రానున్నట్లు ప్రకటించారు.ఈ చిత్రంలో రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu