HomeTelugu Newsనాగచైతన్య క్రికెట‌ర్‌గా...

నాగచైతన్య క్రికెట‌ర్‌గా…

అక్కినేని నాగ‌చైత‌న్య-స‌మంత పెళ్లి త‌ర‌వాత మరోసారి జోడీ కట్టబోతున్నారు. . పెళ్లికి ముందు నాలుగు సినిమాల్లో న‌టించిన ఈ జంట‌, ఇప్పుడు సెకండ్ సెష‌న్‌లోనూ అంతే స్పీడ్‌గా సినిమాలు చేసేందుకు పావులు క‌ద‌ప‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం ఇద్దరు ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. స‌మంత యూట‌ర్న్ రీమేక్‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. చైతూ స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

4 17

ఈ సినిమాలు సెట్స్‌లో ఉండ‌గానే `నిన్ను కోరి` డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో మ‌రో సినిమాకి చైతూ- స‌మంత జోడీ క‌మిట‌య్యారు. ఈ సినిమా క్రికెట్ నేప‌థ్యంలో ఉంటుందట‌. ఇందులో చైత‌న్య ఓ క్రికెట‌ర్‌గా న‌టించ‌నున్నాడు. `కృష్ణార్జున యుద్ధం` నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్దిరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్రికెట్ నేప‌థ్యం క‌థ అన‌గానే చైతూ ఏమాత్రం ఆలోచించ‌కుండా వెంట‌నే సినిమాకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సెట్స్‌లో ఉన్న సినిమాలు పూర్త‌వ్వ‌గానే కొత్త సినిమా మొద‌లెట్టేస్తాడ‌ట‌. ఈ ప్రాజెక్టు గురించి మ‌రిన్ని వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu