HomeTelugu Newsనానితో బిగ్ బాస్-2

నానితో బిగ్ బాస్-2

”బిగ్‌బాస్” టీవీ షో తెలుగు, హిందీ, త‌మిళంలో ఎంత ఆద‌ర‌ణ పొందిందో తెలిసిందే. ఇంగ్లాండులోఈ షో మొద‌లై స‌క్సెస్ కావ‌డంతో ఇండియాలోకి ప్రవేశించింది. అయితే తెలుగు బిగ్‌బాస్-1లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మ‌న‌ల‌ను అల‌రించారు. ఈ షోకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.. అందుకే ఇప్పుడు బిగ్‌బాస్ సీజ‌న్-2 మన ముందుకు రాబోతుంది.

3 3

బిగ్‌బాస్ సీజ‌న్ 2 కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తి తో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి ఎవ‌రు హోస్టింగ్ చేయ‌నున్నారు అనే విష‌యంపై చాలా మంది హీరోల పేర్లు తెర‌పైకి రాగా ఫైనల్ గా మ‌న మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో ”నాని” హోస్ట్ గా చేయ‌బోతున్నారు. అయితే బిగ్‌బాస్ 1 సెట్ మ‌హారాష్ర్ట‌లో ఉండగా సీజ‌న్ 2 కి అన్న‌పూర్ణ స్టూడియోలో సెట్ వేయ‌నున్నట్లు తెలిసింది. ఈ షో కోసం నాని రూ. 4 కోట్లు పారితోషికం తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం .

బిగ్‌బాస్-2 జూన్ లో ప్రారంభం కానుంది. అయితే ఈసారి కుటుంబ స‌భ్యులు గా హీరోయిన్ రాశి, త‌రుణ్‌, తేజ‌శ్వి, గ‌జాల‌, సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల మొద‌లైన వారు క‌నిపించనున్నారట‌. ఈసారి గెస్టుల‌కు ఇబ్బంది లేకుండా బిగ్‌బాస్‌ లేటెస్ట్ టెక్నాల‌జీ ఉప‌యోగించబోతునున్నార‌ట. సీజ‌న్-1లో ఎన్టీఆర్ ఒక్క‌రే హోస్ట్ చేయ‌గా సీజ‌న్ 2లో మ‌న లోక‌ల్ అబ్బాయ్ నానితో పాటు మ‌రో ఇద్ద‌రు అందాల తార‌లు క‌నిపించనున్నార‌ట‌. అయితే ఆ ఇద్ద‌రు ఎవ‌రో తెలియాల్సివుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu