నేను క్షమాపణలు చెప్పను: శృతి

ప్రముఖ సినీ నటుడు అర్జున్.. తనపై లైంగిక ఆరోపణలు చేసిన నటి శృతిహరణ్‌పై దావా వేశారు. ‘నిబునన్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో అర్జున్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన కారణంగా చాలా ఇబ్బందిపడ్డానని ఇటీవల శృతి షాకింగ్‌ విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారింది. శృతి అన్నీ అబద్ధాలు చెబుతోందని అర్జున్‌, అతని తరఫు వారు వాదిస్తుంటే.. ప్రకాశ్‌రాజ్‌, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు శృతికి మద్దతు తెలుపుతున్నారు.

కాగా..గురువారం అర్జున్‌, శ్రుతి హరహరణ్‌లను పిలిచి కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు అర్జున్‌ తరఫున అతని మేనల్లుడు ధృవ బెంగళూరు సివిల్‌ న్యాయస్థానంలో శ్రుతిపై రూ.5 కోట్ల దావా వేశారు. సమస్యను పరిష్కరించడానికి ఛాంబర్‌ అధ్యక్షుడు అంబరీశ్‌, ఇతర సభ్యులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో శృతి తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అర్జున్‌ కోరారు. ఇందుకు శ్రుతిస్పందిస్తూ..’నేను ఇప్పటికీ నా మాట మీదే నిలబడతాను. నాకు ఏది సరైనది అనిపిస్తుందో దాని కోసమే పోరాడతాను. నేను మాత్రం క్షమాపణలు చెప్పను’ అని వెల్లడించారు. మరి ఈ విషయం ఎంతదాకా వెళుతుందో చూడాలి.