HomeTelugu Newsనెగెటివ్‌ రోల్‌లో అల్లరోడి అన్న

నెగెటివ్‌ రోల్‌లో అల్లరోడి అన్న

టాలీవుడ్‌ ప్రముఖ కథనాయకుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమా తరువాత ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో వివేక్‌తో పాటు మరో విలన్‌ కూడీ కనిపించనున్నాడట. హాయ్‌ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన నటుడు ఆర్యన్‌ రాజేష్‌, ఇప్పడు రామ్‌ చరణ్‌ చిత్రంలో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

10 2

ఇప్పటికే జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి హీరోలు విలన్‌లుగా చూపించి మెప్పించిన బోయపాటి, రామ్‌చరణ్‌ సినిమాతో ఆర్యన్‌ రాజేష్‌ను విలన్‌ పాత్రలో పరిచయం చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాలో ఆర్యన్‌, చెర్రీకి అన్నగా కనిపించనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పడు ఉన్న సమాచారం ప్రకారం ఈ అల్లరోడి అన్న నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆర్యన్‌ రాజేష్‌ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu