HomeTelugu Big Storiesఎట్టకేలకు విడుదల కానున్న 'ఉంగరాల రాంబాబు'!

ఎట్టకేలకు విడుదల కానున్న ‘ఉంగరాల రాంబాబు’!

సునీల్ హీరోగా, మియాజార్జ్ జంట‌గా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెర‌కెక్కంచిన‌ ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ న‌టించిన గ‌త‌ చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ త‌ర‌హ కామెడి , క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపిస్తాయి. కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. 

మెస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌టం ఉంగ‌రాల‌ రాంబాబు కి ప్ర‌ధాన‌మైన హైలెట్‌

2017 సంవ‌త్స‌రం మెద‌లు కొని దిల్ రాజు నిర్మాత‌గా శ‌త‌మానం భ‌వ‌తి, నెను లోక‌ల్‌, డి.జె, ఫిదా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధించి స‌క్స‌స్‌ని కేరాఫ్ గా మార్చుకున్నారు. ఓ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయాల‌న్నా, ప్రోడ్యూస్ చేయాల‌న్నా ఆ చిత్రం లో ఎంతో విష‌యం వుంటే కాని దిల్ రాజు ఇన్ వాల్వ్ అవ్వ‌రు. ఇదిలా వుంటే అస‌లు వాయిస్ ఓవ‌ర్ అంటే ఏ హీరోతోనో లేదా ఏ ఫ్యామ‌స్ ఆర్టిస్ట్ తోనే చెప్పించుకుంటారు. కాని మెట్ట‌మెద‌టి సారిగా నిర్మాత దిల్ రాజు గారితో చెప్పించుకొవ‌టం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu