HomeTelugu Big Storiesపవన్‌ పై సుమన్‌ వ్యాఖ్యాలు

పవన్‌ పై సుమన్‌ వ్యాఖ్యాలు

ప్రముఖ నటుడు సుమన్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా గుంటూరులో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సువన్‌ మాట్లడుతూ.. తన అవసరం ఉందనిపిస్తే రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రవేశం గురించి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గురించి స్థానిక మీడియాతో మాట్లాడారు.

9 23

 

పవన్‌ కల్యాణ్‌ లాంటి యువ నేత సమాజానికి ఉపయోగపడే సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. పవన్‌ ప్రస్తావిస్తున్న సమస్యల గురించి గతంలో ఇతర నేతలు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆ సమస్యలను తీర్చలేదు? పవన్‌ రాజకీయ ప్రయాణం కుల, మతాలకు అతీతం. అయితే రాజకీయాల్లో పవన్‌ ఎలా రాణిస్తారు? అన్న విషయాల గురించి మాత్రం నేను ప్రస్తావించలేను. ఎందుకంటే పవన్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నాకు తెలీదు. కానీ పవన్‌ ప్రసంగాలకు యువత బాగా కనెక్ట్‌ అవుతారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు.’ అని వెల్లడించారు సుమన్‌. కాగా సుమన్‌ తన 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో దాదాపు 150 చిత్రాలు చేశారు. ఓ హాలీవుడ్‌ చిత్రంలోనూ సుమన్‌ నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu