పోలీసులతో దిలీప్ కామెడీ!

నటి భావన కేసులో స్టార్ హీరో దిలీప్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారణ చేసి అసలు విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దిలీప్ మాత్రం పోలీసు విచారణలో తమాషాగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతి మేరకు దిలీప్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి సిద్ధమైన పోలీసులకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. వారు వివిధ అంశాలపై ప్రశ్నలు అడుగుతుండగా దిలీప్ దేనికి సమాధానం చెప్పకుండా.. పోలీసులతో కామెడీ చేస్తున్నాడట. పోలీసులు సీరియస్ గా దిలీప్ ను ప్రశ్నిస్తుంటే.. సరదాగా జవాబులు చెప్పడం, జోకులు వేయడం వంటి పనులు చేస్తున్నాడని తెలుస్తోంది. 
పోలీసులకు సహకరించకుండా దిలీప్ కావాలనే ఇలా సమయం వృధా చేస్తున్నాడని తెలుస్తోంది. కోర్టు దిలీప్ ను రెండు రోజులు పాటు కస్టడీకు అప్పగించింది. ఈ రెండు రోజుల పాటు పోలీసుల నుండి తప్పించుకోగలిగితే చాలు.. ఆ తరువాత బెయిల్ తెచ్చుకొని బయటకు రావొచ్చనేది దిలీప్ ఆలోచనగా అలా ప్రవర్తించాడు. కానీ తాజాగా కోర్టు అతడికి బెయిల్ నిరాకరించడంతో ఏం చేయాలో.. తోచని స్థితిలో పడిపోయాడు దిలీప్. కొందరు దిలీప్ క్రిమినల్ అని ఆరోపిస్తుంటే.. మరోపక్క అమాయకంగా ప్రవర్తిస్తూనే కావాలని తప్పించుకునే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.