HomeTelugu Newsపోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో సమంత 'యూ టర్న్‌'

పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో సమంత ‘యూ టర్న్‌’

వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం ‘యూ టర్న్‌’ సినిమాలో నటిస్తోంది. మహానటి చిత్రంతో జర్నటిస్ట్‌ మధురవాణిగా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది సమంత. యూ టర్న్‌ లో కూడా సామ్‌ జర్నలిస్ట్‌ గానే దర్శనమీయనుంది. తాజాగా టైమ్స్‌ అఫ్‌ ఇండియా, హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఒక పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో జరుగుతోంది.

9 7

పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నికేత్‌ సినిమాటోగ్రఫి అందుస్తున్నారు. సిల్వర్‌ స్ర్కీన్‌ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక చావ్ల, రవి ప్రకాష్‌ బిర్లా బోస్‌, ఛత్రపతి శేఖర్‌ తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu