HomeTelugu Newsఫ్లాప్ అయినా.. రవితేజకు నష్టమేమీ లేదు!

ఫ్లాప్ అయినా.. రవితేజకు నష్టమేమీ లేదు!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలదంరూ కూడా రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తున్నారు. ఒకవేళ ఫ్లాప్ వచ్చినా సరే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దానికి కారణం కాస్త క్రేజ్ ఉన్న హీరోల సంఖ్య తక్కువగా ఉండడమే. చాలా కాలం గ్యాప్ తీసుకొని రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో రవితేజ రెమ్యునరేషన్ పెంచేశారు. కానీ రీసెంట్ గా అతడు నటించిన ‘టచ్ చేసి చూడు’ సినిమా ఫ్లాప్ కావడంతో మాస్ రాజా పారితోషికం ఏమైనా తగ్గిస్తారేమో అనుకుంటే రివర్స్ లో పెంచారు రవితేజ.

ravitejaమైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం రవితేజకు పదమూడు కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రవితేజ రెమ్యునరేషన్ తొమ్మిది కోట్లు మాత్రమే కానీ ఆయన డిమాండ్ చేయడంతో అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారు. శ్రీనువైట్ల తన కథకు రవితేజ మాత్రమే సెట్ అవుతారని చెప్పడం, కావాలంటే తన రెమ్యునరేషన్ తగ్గించమని చెప్పడంతో అంత మొత్తాన్ని ఇవ్వాడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి రవితేజకు ఫ్లాప్ వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నమాట!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!