
Ranbir Kapoor Ramayana Glimpse:
రామ్‌కపూర్ నటించిన Ramayana Part 1 గ్లింప్స్ విడుదలైంది. మూడున్నర నిమిషాల టీజర్ ఇది, కానీ ఇందులో దర్శకుడు అందించిన కంటెంట్ అభిమానులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.
విజువల్స్ చూస్తే మొదట్లోనే ఫ్యాన్‌మెడ్ వీడియో అనిపించేలా ఉన్నాయి. టైటిల్ కార్డ్స్‌తో పాటు ఉండే టెక్స్ట్ చాలా వీక్‌గా, ఆకర్షణ లేకుండా ఉందన్నది ఓవర్వ్యూ. “5000 సంవత్సరాలుగా 2.5 బిలియన్ మందికి పూజలందుకున్న గ్రంధం” అనే లైన్ టీజర్‌లో కనిపించింది. కానీ ఈ లైన్ మీదే వివాదం మొదలైంది.
వాస్తవానికి మహాభారతం సుమారు 3200 BCEకి చెందినదిగా పరిశోధకులు భావిస్తారు. అంటే 5200 ఏళ్ల పురాతనమైనదిగా భావిస్తారు. కానీ రామాయణం విషయానికి వస్తే, వాల్మీకి రామాయణం ప్రకారం ఇది ప్రస్తుత మన్వంతరంలో 24వ మహాయుగం కాలంలో జరిగిన సంఘటనలు. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే స్పష్టమైన డేటింగ్ లేదు. అటువంటి పరిస్థితుల్లో “5000 ఏళ్ల గ్రంధం” అనే క్లెయిమ్ తగదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్‌ఇంప్రెసివ్‌గా ఉందని టాక్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయినప్పటికీ, అతని మార్క్ కనిపించకపోవడం పజిల్‌గా మారింది. చివర్లో రణబీర్ కపూర్ బాణాన్ని ఎక్కించే సీన్ తప్ప టీజర్ అంతా ఫ్యాన్‌మెడ్ లుక్‌ను కలిగించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Adipurush వంటి తప్పులను మళ్లీ రిపీట్ చేయకూడదని అభిమానులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ఈ గ్లింప్స్ ప్రామిస్ చేయలేదని స్పష్టమవుతోంది.
ALSO READ: “అది టాక్సిక్ గా మారింది” Samantha దేని గురించి చెబుతోందంటే..