HomeTelugu Newsబిగ్‌ బి షార్ట్‌ ఫిలిం

బిగ్‌ బి షార్ట్‌ ఫిలిం

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు బిగ్‌ బి తాజాగా రైల్వే షార్ట్‌ ఫిలింలో నటించారు. “చాలా మంది ప్రయాణికుల మృతికి కారణమైన రైలు పట్టాలను దాటకండి… పాదచారుల వంతెనలను ఉపయోగించండి” అంటూ అమితాబ్‌ బచ్చన్‌ రైల్వేశాఖ తరపున ప్రచారోద్యమం చేపట్టారు. ముంబై నగరంలో పట్టాలు దాటుతూ పలువురు ప్రయాణికులు మరణిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అమితాబ్‌ తో ప్రచార కార్యక్రమాన్ని సెంట్రల్‌ రైల్వే డివిజన్‌ చేపట్టింది. దీనికోసం బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో పాటు పలువురు సెలబ్రిటీల రైల్వే యాత్ర అనుభవాలను జోడించి రైల్వే శాఖ “ఏక్ సఫర్ కే సాథ్‌” పేరిట ఓ షార్ట్‌ ఫిలింను నిర్మించింది.

2 13

 

ఈ షార్ట్‌ ఫిలింలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ లో నిలబడి రైల్వే భద్రతపై ప్రయాణికులకు సందేశమిచ్చారు. బిగ్‌ బి సందేశంతోనైనా ముంబై సబర్బన్‌లో రైలు పట్టాలపై ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu