HomeTelugu Newsబుల్లి తెరపై 'బ్రహ్యానందం'

బుల్లి తెరపై ‘బ్రహ్యానందం’

హాస్య బ్రహ్మాగా పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్యానందం. ఒక దశాబ్దం పాటు దాదాపు విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించిన సీనియర్ నటుడు బ్రహ్మానందంకు ఈ మధ్య సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. కొన్ని సినిమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. దీంతో బ్రహ్మానందం బుల్లి తెరపై దృష్టి పెట్టారు. ఛానెల్ స్టార్ మా బ్రహ్మానందం వ్యాఖ్యాతగా ఒక కామెడీ షోను ప్లాన్ చేసింది.

6 22

బ్రహ్మానందంను నవ్వించగలిగే కామెడీ యాంగిల్ మీలో ఉంటే షోలో పాల్గొనండి అంటూ ప్రోమోను కూడ రిలీజ్ చేశారు. స్టార్ మా లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో తర్వాత ఈ కామెడీ షో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ అటు సినిమాలతో పాటు బుల్లితెరపై యాంకర్స్ వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇదే కోవలో స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మానందం చేరిపోయారు. ఈటీవీ జబర్దస్త్‌ కామెడీ షోకు ఈ షో ని పోటీగా నిలపాలి అని స్టార్ మా వాళ్ళు భావిస్తున్నట్లు టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu