HomeTelugu NewsGeethu Royal : బిగ్‌బాస్‌ బ్యూటీకి అరుదైన వ్యాథి.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్స్!

Geethu Royal : బిగ్‌బాస్‌ బ్యూటీకి అరుదైన వ్యాథి.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్స్!

 

Geethu Royal

Geethu Royal: బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ కి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆమె తన ఆరోగ్యం గురించి చేసిన వీడియో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ షో వేదికగా పాపులారిటీ రాబట్టింది. సీజన్ 6లో గీతూ రాయల్ పార్టిసిపేట్ చేసింది. ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ ని శాసించింది. బిగ్ బాస్ ఆమె చుట్టూ గేమ్ నడిపేవాడు. దీంతో గీతూ రాయల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. దీంతో… జనాలకు గీతూ రాయల్ తీరు నచ్చకపోవడంతో గుడ్ బై చెప్పేశారు.

9వ వారం గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యింది. ఊహించని ఈ పరిణామంతో గీతూ రాయల్ హార్ట్ బ్రేక్ అయ్యింది. నన్ను ఎలిమినేట్ చేయవద్దని హోస్ట్ నాగార్జునను వేడుకుంది. నాగార్జున ఆమెకు నచ్చజెప్పి పంపాడు.

కాగా సీజన్ 7 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా గీతూ రాయల్ వ్యవహరించింది. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని తనదైన ప్రషన్లతో ఉక్కిబిక్కిరి చేసింది. బిగ్ బాస్ 7 ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద రచ్చ జరిగింది. గీతూ రాయల్ పై కొందరు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. గీతూ రాయల్ కేసు పెట్టింది.

ఇదిలా ఉంటే గీతూ రాయల్ ఒక సీరియస్ ట్రబుల్ ఫేస్ చేస్తుందట. డాక్టర్స్ చెప్పిన మాటలకు ఆమెకు డిప్రెషన్ కి గురైందట. గీతూ రాయల్ కి గాయమైందట. రోజులు గడుస్తున్నా అది మానకపోవడంతో పెద్ద హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించిందట.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యిందన్నారట. అలాగే దీనికి రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రతిరోజూ ఒక ఇంజక్షన్ వేసుకోవాలని సూచించారట. డాక్టర్స్ చెప్పిన మాటలతో గీతూ రాయల్ డిప్రెషన్ కి గురైందట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినవారు పూర్తిగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలట.

సరైన తిండి, నిద్ర లేకపోతే 40 ఏళ్లకే చనిపోతావని చెప్పారట. క్రమశిక్షణగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని గీతూ రాయల్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గీతూ రాయల్ వికాస్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. ఆ అబ్బాయి తన చిన్ననాటి ఫ్రెండ్‌ అని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!