HomeTelugu Big Storiesమెగాస్టార్‌ చిరంజీవి 'సైరా' టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చారత్మతిక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా టీజర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందే ఈ సర్‌ప్రైజ్‌ను ప్రేక్షకులను అందించారు. ఇక టీజర్‌లోకి వెలితే..

3 23

‘బ్రిటిష్‌ పాలనలోని రాచరికాలను చూపించారు. ఓ బ్రిటిష్ వ్యక్తి ‘సైరా నరసింహారెడ్డి’ అని అరుస్తున్నప్పుడు చిరంజీవి గుర్రంపై వచ్చి పోరాడుతున్న సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ‌స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాలవాడ పాత్రలో చిరు ఒదిగిపోయారు.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌..చిరంజీవికి గురువుగా కీలక పాత్ర పోషించారు.

3a 3

విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu