HomeTelugu Newsమెగాస్టార్‌ బర్త్‌డేకి.. రాజశేఖర్‌ ప్రీ లుక్‌

మెగాస్టార్‌ బర్త్‌డేకి.. రాజశేఖర్‌ ప్రీ లుక్‌

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్‌ తన కొత్త సినిమా సినిమా ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్ వర్మ (అ! ఫేం) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1983 నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిస్తున్నారు.

8a 6

ఆగస్టు 22 బుధవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ.. రాజ‌శేఖ‌ర్ తన సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. అందులో 1983లో చిరు న‌టించిన ‘ఖైదీ’ చిత్రం పోస్ట‌ర్‌ ఉంచారు. 1983లోనే భారత్‌ క్రికెట్‌లో ప్రపంచ కప్‌ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను కూడా ప్రీలుక్‌లో చూపించారు.

8 19

అ! వంటి వైవిధ్య‌మైన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్-రాజ‌శేఖ‌ర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. ఆగ‌స్ట్ 26న రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu