HomeTelugu Newsదొంగ ఓట్లు తొలగించమంటే మమ్మల్నే నిందిస్తారా?: జగన్

దొంగ ఓట్లు తొలగించమంటే మమ్మల్నే నిందిస్తారా?: జగన్

4 5
నెల్లూరులో జరిగిన వైసీపీ సమరశంఖారావం సభలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ వ్యవహారంలో చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. వైసీపీ తరపున ఫాం-7 ఇవ్వడం తప్పా..? దొంగ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేస్తూ ఫాం- 7 ఇచ్చాం.. దొంగ ఓట్లు తొలగించమంటే టీడీపీ నేతలు.. తిరిగి మాపైనే నిందలు వేస్తున్నారన్నారు అని జగన్ మండిపడ్డారు.

అసలైన ఓట్లను చేర్చి, దొంగ ఓట్లను తొలగించమని అడిగితే టీడీపీ నేతలు మాపైనే నిందలు వేస్తున్నారు, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తారా అంటూ దుయ్యబట్టారు. దొంగ ఓట్లు తొలగించమని ఫాం-7 ఇవ్వడాన్ని తప్పుపడ్తున్నారని సున్నితమైన డేటా చంద్రబాబు తన కంపెనీలకు అక్రమంగా ఇచ్చారని జగన్ ఆరోపించారు తప్పు చేసిన వ్యక్తి, క్షమాపణ చెప్పాల్సింది పోయి, తమపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దాదాపు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని జగన్ ఆరోపించారు వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చివరికి తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటును సైతం తొలగించారన్నారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో ఏపీ ప్రజల సమాచారం ఎందుకు ఉందని ప్రశ్నించారు జగన్‌. బీనామి కంపెనీలకు డేటాను అప్పగించడమే కాకుండా.. బుకాయిస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu