HomeTelugu Newsదానవీరశూరకర్ణగా మారిన బాలయ్య

దానవీరశూరకర్ణగా మారిన బాలయ్య

‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నది. మూడు రోజులపాటు అక్కడ షూటింగ్ జరుపుకోబోతున్నది. ఈ మూడు రోజులు దానవీరశూరకర్ణ సినిమాకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరణ చేస్తున్నారట.

4 11

మొదటిరోజు ఈ సినిమాలోని చిత్రం భళారే విచిత్రం సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఇందులో బాలకృష్ణతో పాటు శ్రీయ కూడా నటిస్తున్నది. రెండో రోజు అర్జునుడు క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరించబోతున్నారు. ఇందులో అర్జునుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నారట. మూడోరోజు కర్ణ పాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu