HomeTelugu News'యూటర్న్' ఆది పినిశెట్టి లుక్‌

‘యూటర్న్’ ఆది పినిశెట్టి లుక్‌

సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. ఈ చిత్రానికి పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో సమంత లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం శుక్రవారం ఆది పినిశెట్టి లుక్‌ను పంచుకుంది. ఇందులో ఆది కళ్లు మాత్రమే కనపడ్డాయి. సమంత గొడుగు పట్టుకుని నడుస్తున్నారు. ఈ సినిమా ఓ ఆసక్తికర మలుపు కాబోతోందని పవన్‌, సమంత, భూమిక, రాహుల్‌ రవీంద్రన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతని ఆది ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

6 1

కాగా ఈ ‘యూటర్న్’ చిత్రంలో ఆది పినిశెట్టి పోలీసు అధికారిగా కనిపించనున్నారని సమంత ట్విటర్‌ ఛాట్‌లో చెప్పిన విషయం తెలిసిందే.నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బందరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సెప్టెంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu