HomeTelugu Newsనాని సుధీర్ 'వి' మూవీ అప్‌డేట్స్

నాని సుధీర్ ‘వి’ మూవీ అప్‌డేట్స్

1 23
డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ.. నేచురల్‌ స్టార్‌ నానీకి, హీరో సుధీర్ బాబుకి కూడా మంచి హిట్స్ సినిమాలు ఇచ్చాడు. ఈ ఇద్దరితో ఆయన చేసిన చిత్రాలు వైవిధ్యభరితమైనవిగా నిలిచాయి. అలాంటి ఇంద్రగంటి ఈ ఇద్దరితో కలిసి ‘వి’ సినిమా చేశాడు. పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని ఇప్పటికే విడుదల చేశారు.

హీరోగా దూసుకుపోతున్న నానీ.. విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసమేనని అనుకున్నారు. కానీ ఈ పాత్రకి సంబంధించిన ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందట. అది క్లైమాక్స్ లో రివీల్ అవుతుందనే తాజా సమాచారం. ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ పాత్రను చేయడానికి నాని అంగీకరించాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా ఈ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచే విషయమే. మార్చి 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, నివేద థామస్ .. అదితీరావు హీరోయిన్‌లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu