HomeTelugu Big Storiesరికార్డ్ క్రియేట్ చేసిన 'సైరా' టీజర్‌

రికార్డ్ క్రియేట్ చేసిన ‘సైరా’ టీజర్‌

సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో కూడా మెగాస్టార్ చిరంజీవి మీద ప్రేక్షకులకున్న అభిమానం, యువతలో ఆయన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు సరికాదు ఇంకా పెరిగిపోయింది. అందుకు ఉదాహరణే నిన్న విడుదలైన ఆయన తాజా చిత్రం ‘సైరా’ టీజర్ సాధించిన వ్యూస్. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఉదయం 11 గంటల 30 నిముషాలకు రిలీజైన ఈ టీజర్ ఇప్పటికి 6.6 మిలియన్ల వ్యూస్, రెండున్నర లక్షల లైక్స్ సాధించి సరికొత్తను రికార్డ్ క్రియేట్ చేసింది.

5 24

అభిమానులు, ప్రేక్షకులు టీజర్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో చిత్రంపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇక చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమాను 2019 వేసవికి విడుదలచేస్తామని ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా, చరిత్ర సృష్టించేలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సినిమాలో నయన తార హీరోయిన్‌గా నటిస్తుంది. అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu