HomeTelugu Newsరీయల్‌ హీరోగా మారిన ప్రభాస్‌

రీయల్‌ హీరోగా మారిన ప్రభాస్‌

 

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఎప్పుడూ వివాదాలకు దూరంగా.. సింప్లిసిటికి దగ్గరగా ఉంటాడు. ఓ చిన్నారికి తన అవసరం ఉందనే విషయం తెలుసుకున్న ప్రభాస్ దాన్ని నెరవేర్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. పెద్దలతో పాటు చిన్నారులు కూడా బాగా ఇష్టపడే సినిమా బాహుబలి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిజం అంటే చిన్నారులకు చాలా మక్కువ. మదన్ రెడ్డి అనే కుర్రాడికి కూడా బాహుబలి సినిమా అంటే చాలా ఇష్టం. అందులో ప్రభాస్ అంటే ఇంకా ఇష్టం.

9a 3

మదన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆ కుర్రాడి కోరికను తీర్చడానికి అతడి తండ్రి ప్రభాస్ అభిమానుల సహాయం కోరాడు. చాలా సార్లు బాహుబలి సినిమాను చూసి ప్రభాస్‌పై బాగా అభిమానం పెంచుకున్నాడు మదన్. కొన్ని రోజుల తరువాత తన అభిమాన నటుడు ప్రభాస్‌ని కలవాలని కోరుకున్నాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ వార్త ప్రభాస్‌కు చేరేలా చేశారు. విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే స్పందించి మదన రెడ్డి కోరికను నెరవేర్చాడు. దీంతో మదన్‌తోపాటు అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

9 11

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu