రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విలన్‌గా ‘కేజిఎఫ్’ హీరో?


మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం భారీ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్)తో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే కొంత వరకు పూరైంది. కాగా ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరైతే ఇందులో ‘కేజిఎఫ్’ సినిమా హీరో యాష్ నటిస్తాడని అన్నారు. ఆ తరవాత అవన్నీ రూమర్స్ అనే వార్తలు కూడా వినిపించాయి.

కానీ ఇప్పుడు ఈ వార్తే నిజమేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే ‘కేజిఎఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నెల 9న జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరుకానున్నారు. దీన్నిబట్టి తన సినిమాలో యాష్ ను విలన్‌గా తీసుకోవాలనే ఆలోచన జక్కన్న మదిలో ఉందని, అందుకే అతని సినిమా వేడుకకు అతిథిగా వెళుతున్నారని అనిపిస్తోంది. కాగా ఈ సినహీరోయిన్స్ ఎవరు అన్నది ఇంకా ప్రకటించలేదు.

CLICK HERE!! For the aha Latest Updates