రానాను టెన్షన్ పెడుతోన్న విషయం!

తెలుగు సినిమాలకు యాంటీ క్లైమాక్స్ కలిసిరాదనే చెప్పాలి. మన ఆడియన్స్ యాంటీ క్లైమాక్స్ రిసీవ్ చేసుకోలేరు. రీసెంట్ గా వచ్చిన ‘ఒక మనసు’ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఒకరకంగా యాంటీ క్లైమాక్స్ అనే చెప్పాలి. మొదట అలాంటి కథలను నిర్మించడానికి నిర్మాతలు కూడా సాహసం చేయరు. క్లైమాక్స్ ఒక్కటి మార్చండి అంటూ దర్శకులతో చెబుతుంటారు. దానికి కారణం మన ప్రేక్షకులే.. మన సినిమాల్లో హీరో, హీరోయిన్ చనిపోవడాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేరు. ఇప్పుడు రానాను భయపెడుతోన్న విషయం కూడా ఇదే.. 
తాజాగా ఆయన నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో చివరకు రానా పాత్రను ఉరితీస్తారని సమాచారం. ఆ విధంగా సినిమా యాంటీ క్లైమాక్స్ తో ఉండడం ఖాయం. ఆఖరికి కాజల్ కూడా చనిపోతుందట. సినిమాలో హీరో, హీరోయిన్లు చనిపోతే ఇక సినిమా ఏముంటుందని నిర్మాత సురేష్ బాబు క్లైమాక్స్ మార్చమని తేజపై కాస్త ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ తేజ మాత్రం పతాక సన్నివేశాల విషయంలో నమ్మకంగా ఉండడంతో క్లైమాక్స్ ను మార్చడానికి అంగీకరించలేదు. అయితే ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా..? లేదా..? అనే టెన్షన్ లో రానా ఉన్నట్లు తెలుస్తోంది.