HomeTelugu Newsశైలజారెడ్డి అల్లుడి తొలి రాగం

శైలజారెడ్డి అల్లుడి తొలి రాగం

అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి మారుతి దర్వకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని తొలి పాట ‘అను బేబీ’ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇమ్మాన్యుయేల్‌ పేరులోని తొలి పదంతోనే ఈ పాట మొదలవడం ఆకట్టుకుంటోంది.

1 16

కాగా ఈ పాట విడుదల కాగానే చైతూ భార్య సమంత ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఈ పాట నాకు చాలా నచ్చింది’ అని ట్వీట్‌ చేస్తూ వీడియోను పంచుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ ఎస్‌, పీడీవీ ప్రసాద్ ‌సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు. ఆగస్టు 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu