HomeTelugu Newsవర్మ పుట్టినరోజునాడే 'సర్కార్ 3 '!

వర్మ పుట్టినరోజునాడే ‘సర్కార్ 3 ‘!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ‘సర్కార్ త్రీ’. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్ లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మనోజ్ బాజ్ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ‘సర్కార్ 3 ‘ చిత్రాన్ని పరాగ్ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్ బచ్చన్ నిర్మిస్తున్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu