HomeTelugu News'సిల్లీ ఫెలోస్' ట్రైలర్‌

‘సిల్లీ ఫెలోస్’ ట్రైలర్‌

అల్లరి నరేష్‌, సునీల్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న డబుల్‌ డోస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సిల్లీ ఫెలోస్‌. అల్లరి నరేష్‌ హీరోగా సుడిగాడు లాంటి సూపర్‌ హిట్ సినిమాను తెరకెక్కించిన భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈరోజు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

1 41

ట్రైలర్‌లో అల్లరి నరేశ్‌ పెళ్లి గురించి ఆలోచిస్తూ..’ఒక విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ. ఒక వీరబాబు, వాసంతి..ఆహా’ అంటూ చెప్తున్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. అర్జున్‌ రెడ్డి, ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాల్లోని ముద్దు సన్నివేశాల గురించి సునీల్‌ వేసిన పంచ్‌లు హైలైట్‌గా నిలిచాయి. నరేశ్‌, హీరోయిన్‌తో కలిసి ఫైటింగ్‌ చేస్తూ.. మణిగంధం బహిర్ముఖం అంటూ బాహుబలి డైలాగ్‌ చెప్పడం, ఇందుకు పోసాని కృష్ణమురళి సారీ మిస్టర్‌ రాజమౌళి అనడం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో బ్రహ్మానందం ఆటోలో హాస్పిటల్‌కు పోలీస్‌ గెటప్‌లో వచ్చి ఎక్స్‌రే పట్టుకుని స్కానింగ్‌ ఏం చెప్తోంది? అని అడగటం నవ్వులు పూయిస్తోంది. ఇందుకు పక్కనే ఉన్న సునీల్‌.. అది స్కానింగ్‌ కాదు ఎక్స్‌రే అని చెప్పడం ఇందుకు బ్రహ్మీ.. తెలుసు. అటు తిప్పి పట్టుకోవడం వల్ల స్కానింగ్‌ అనుకున్నా అని సమాధానమివ్వడం ఫన్నీగా ఉంది. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.పోసాని, బ్రహ్మనందం, జయ ప్రకాష్ రెడ్డి తదతరు నటిస్తున్నారు. ఈ సిల్లీ ఫెలోస్‌ త్వరలోనే థియేటర్ ల్లో కలుస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu