HomeTelugu News'సైరా' టీజర్‌ రేపే

‘సైరా’ టీజర్‌ రేపే

‘సైరా నరసింహారెడ్డి’ మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నయన తార, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తూన్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

11 14

ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఒకరోజు ముందుగానే(మంగళవారం) ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేదీ బాణీలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అమిత్‌కు సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఉడాన్, వేక్‌ అప్‌ సిడ్‌స, ఐషా, దేవ్‌ డి, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, ఇషక్‌ జాదే, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌,బాంబే వెల్వెట్‌, ఉడ్తా పంజాబ్‌, క్వీన్ చిత్రాలకు సంగీతం అందించిన అమిత్‌ తెలుగులో ‘సైరా’కు సంగీతం అందిస్తున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu