హిట్ సినిమా ఫార్మాట్ రిపీట్!

త్రివిక్రమ్ శ్రీనివాస్,పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేసారు. వీటిలో జల్సా సూపర్ హిట్ సినిమా కాగా అత్తారింటికి దారేది అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పడు పవన్,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ని సైతం క్రాస్ చేస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యకుండా సైలెంట్ గా పనిచేసుకుంటున్న త్రివిక్రమ్ దీంట్లో అత్తారింటికి దారేది లో సూపర్ గా క్లిక్ అయిన కొన్ని ఎలిమెంట్స్ కి ఎక్సటెన్షన్స్ వాడుతున్నాడట.

ఆ సినిమాలో కళ్ళజోడు ఫైట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.అందుకే ఇప్పుడు రాబోతున్న అజ్ఞాతవాసిలో కూడా ఇలాంటి స్కీమ్ బేస్డ్ ఫైట్ ఒకటి ప్లాన్ చేసి రీసెంట్ గా షూట్ చేశారట. ఇది కూడా అద్భుతంగా వచ్చిందని థియేటర్స్ లో క్లాప్స్ పడతాయని యూనిట్ మెంబెర్స్ చెబుతున్నారు. ఇక ఆల్రెడీ స్టార్ట్ అయిన బల్గెరియా షెడ్యూల్ లో కూడా అను ఇమ్మాన్యూల్ పైన ఒక పాట,అలాగే కీర్తి సురేష్ పై ఒక పాట పిక్చరైజ్ చేస్తారట. అత్తారింటికి దారేది లో కూడా సేమ్ థీమ్ ఫాలో అయ్యారు. ఇక పవన్ ఇంట్రడక్షన్ రిచ్ గా ఉండేలా ఒక యాక్షన్ బ్లాక్ కూడా ఫారెన్ లో షూట్ చేస్తున్నారు.

ఇది కూడా అత్తారింటికి దారేది మ్యాజిక్ ని గుర్తు తెచ్చేలా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.జనవరి 10 న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో రికార్డ్స్ పరంగా బాక్స్ ఆఫీస్ కనీవిని ఎరుగని కొత్త లెక్కలు చూడడం ఖాయం. అన్నట్టు నవంబర్ 7 న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని,ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యబోతున్నారు.