HomeTelugu Big Storiesహరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది అంటున్న ప్రియదర్శి

హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది అంటున్న ప్రియదర్శి

Harish Shankar Priyadarshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలో అటు రాజకీయాలో . బిజీగా ఉన్నారు.ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం కూడా స్టార్ట్ కాబోతోంది… ఇదిలా ఉండగా సారధి స్టూడియోలో ఆసక్తికర సంఘటన జరిగింది.

ఎప్పటిలాగ సారధి స్టూడియోలో షూటింగకి వెళ్ళాను, కానీ ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసిన హడావిడి, అందరి కళ్ళలో ఏదో సందడి, అందరి నోట్లో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అంతే! వారితో ఒక మాటైనా మాట్లాడాలి, వారు తీసిన చిత్రం ‘జానీ’ ఎంతగా నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను! హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది, నీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న! కళ్యాణ్ గార్ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి.. అంటూ ప్రియదర్శి ట్వీట్ చేసాడు…ఇక ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ వైరల్ అవుతుంది..

Recent Articles English

Gallery

Recent Articles Telugu