Bigg Boss 8 Telugu First Elimination:
Bigg Boss 8 Telugu రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతూ వస్తోంది. ఇప్పటికే ఒక వారం పూర్తి చేసుకున్న ఈ సీజన్ నుండి మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది బేబక్క. నిజానికి ఈసారి సీజన్లో తెలిసిన సెలెబ్రిటీలు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే యూట్యూబ్లో మాత్రం బేబక్క బాగా ఫేమస్. బోలెడంత మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.
అయితే యూట్యూబ్లో అంత ఫేమస్ అయినా బేబక్క మొదటి వారమే ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దానికి ఉన్న ఒకే ఒక కారణం ఆమెకి ఓట్లు తక్కువ పడ్డాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమెకు ఎందుకు ఓట్లు పడలేదు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న.
బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు తను వచ్చిందే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి అంటూ.. అందరికీ నేను బేబక్కను కానీ మీకు మాత్రం జస్ట్ బేబ్ ని అని అంటూ నాగార్జునకి చెప్పి మరి వచ్చిన బేబక్క కిచెన్ కే పరిమితం అయిపోయింది. ఇంట్లో వాళ్లకి వంటలు చేసి పెడుతూ.. వంటల విషయంలో కూడా రెండు మూడు గొడవలు పడుతూ మొదటివారం పెద్దగా పర్ఫామెన్స్ మాత్రం ఏమీ చూపించలేదు.
ఈ కారణంగానే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇదేమి కొత్త కాదు. బిగ్ బాస్ ఇంటికి వచ్చిన చాలామంది సీనియర్లు మొదటి వారం అయిన ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకు షకీలా, కరాటే కళ్యాణి, హేమ, కిరణ్ రాథోడ్ వంటి సీనియర్ నటిమణులు మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు.
నటుడు శివాజీ మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఫైనాన్స్ దాకా ఉండగలిగారు. ఎంటర్టైన్మెంట్ విషయంలో బేబక్క చేసింది ఏమీ లేదు కాబట్టి ఆమె కూడా మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు.