మహేష్ డేట్ ఫిక్స్ చేశాడా..?

మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జూన్ 23న సినిమాను విడుదల చేయడం బెటర్ అని నిర్మాత ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆ తరువాత పూణే, గోవా వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది.

ఫిబ్రవరి నాటికి సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. మార్చిలో పాటలను చిత్రీకరించి, ఏప్రిల్, మే నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి జూన్ నెలలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్ నుండి మహేష్ బాబు, కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి సిద్ధమవనున్నాడు.