HomeTelugu Newsహిట్ దర్శకుడితో సాయి ధరమ్‌ తేజ్‌

హిట్ దర్శకుడితో సాయి ధరమ్‌ తేజ్‌

యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయమైయ్యాడు. కెరీర్‌ ప్రారంభంలో పరవాలేదనిపించిన సాయి ధరమ్‌ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చిత్రలహరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా తేజ్‌ ఇప్పటికే ఫైనల్‌ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

5 3

తాజాగా గీతా ఆర్ట్స్‌ 2 బ‍్యానర్‌ లో సూపర్‌ హిట్ కొట్టిన దర్శకుడితో సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ వాసు నిర్మాతగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమా గీత గోవిందం. ఈ చిత్ర దర్శకుడు పరుశురాం అదే బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఆ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించనున్నాడట. ఇప్పటికే కథ కూడా ఫైనల్ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకావం ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu