రాయ్ లక్ష్మీ ఆశలపై నీరు జల్లేసింది!

జూలీ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎన్నో అంచనాలు పెట్టుకోని ఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. విడుదలకు ముందు సినిమా అవుట్ ఫుట్ గురించి చిత్ర యూనిట్ టాక్ ను బాగానే  క్రియేట్ చేసింది. తీరా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అసలు రంగు బయట పడింది. సినిమాలో లక్ష్మి రాయ్ మొత్తంగా గ్లామర్ పైనే దృష్టి పెట్టింది. చిత్ర యూనిట్ పనితనం కూడా అమ్మడి గ్లామర్ సీన్స్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. 

సినిమాలో చాలా సన్నివేశాలు ‘డర్టీ పిక్చర్’ , ‘హీరోయిన్’ సినిమాల నుండి కాపీ చేసినట్లుగా అనిపించింది. సినిమాలో చాలా సన్నివేశాలు ‘డర్టీ పిక్చర్’ , ‘హీరోయిన్’ సినిమాల నుండి కాపీ చేసినట్లుగా అనిపించింది. కథ, కథనాల్లో సత్తా లేకపోవడం రాయ్ లక్స్మీ అందాల ఆరబోత థియేటర్లో కూర్చొని చూడడానికి ఇబ్బందికరంగా ఉండడంతో ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.