వైట్ల నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా..?

ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలతో వరుస ఫ్లాప్ లను చవి చూసిన దర్శకుడు శ్రీనువైట్ల మీడియాకు ముఖం చాటేశాడు. ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ సహజం. ఈ విషయం వైట్లకు బాగా తెలుసు. మరి ఆయన మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు..? తన తదుపరి సినిమా ఎవరితో చేస్తారనే విషయాల్లో స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం అయితే ఆయన కథలు రాసుకుంటున్నాడు. ఇంటి వాస్తు సరిగ్గా లేదని ఈ మధ్య ఇల్లు కూడా మారాడు. తన పాత ఇంట్లోకే వెళ్ళినట్లు సమాచారం. 
తనకు హిట్స్ వచ్చిన సమయంలో ఆయన ఆ ఇంట్లోనే ఉన్నారట.
వాస్తు సంగతి బాగానే చూసుకున్నాడు మరీ హీరోను చూసుకున్నాడా లేదా అనేదే అనుమానంగా మారింది. రామ్ తో సినిమా చేస్తాడని గతంలో వార్తలు వినిపించాయి. మరి ఈ పరిస్థితుల్లో రామ్, వైట్లను నమ్మి సినిమా చేస్తాడా..? హీరో సంగతి పక్కన పెడితే వైట్ల ఇకనైనా కొత్తదనం ఉండే కథలు రాసుకుంటే మంచిది. లేదంటే మీడియం రేంజ్ హీరోలు కూడా వైట్లకు దొరకడం కష్టమవుతుంది. ఫ్లాప్స్ వచ్చినా.. రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈసారి మరో హీరో ఛాన్స్ ఇస్తారనే గ్యారంటీ కూడా లేదు. సో.. ఇక వైట్ల కథ, కథనాల మీద ఫోకస్ చేస్తే బెటరేమో.