HomeTelugu TrendingOTT: ఈ వారం అలరించనున్న 20 సినిమాలు.. ఏంటంటే?

OTT: ఈ వారం అలరించనున్న 20 సినిమాలు.. ఏంటంటే?

 

20 movies to be released on
ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం తక్కువైంది. పైగా పరీక్ష కాలం కవడంతో.. థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవి లేవు. కొన్ని చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు సందడి చేయనున్నాయి. వాటిలో మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల నుంచి ఆస్కార్ అవార్డ్ పొందిన
ఓపెన్ హైమర్ వరకు ఉన్నాయి.

ఈ వారం మార్చి 18 నుంచి మార్చి 23 వరకు మొత్తంగా 20 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. వాటిలో 6 మార్చి 22న స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటన్నింటిలో మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా అబ్రహం ఓజ్లర్, ఆస్కార్ 2024లో 7 అవార్డ్స్ సాధించిన ఓపెన్ హైమర్ సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితోపాటు సారా అలీ ఖాన్ నటించిన ఏ వతన్ మేరే వతన్, ఎక్స్ మ్యాన్ 97 సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్‌గా మలయాళం సినిమా)- మార్చి 20 నుంచి స్ట్రీమింగ్
సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్)- మార్చి 20న రిలీజ్క్స్
ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 22
డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22
లూటేరే (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 22
ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 24

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ చిత్రం)- మార్చి 18
త్రీ బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 21
ఫైటర్ (హిందీ సినిమా)- మార్చి 21
బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22
షిర్లే (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22
ది కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ
మరక్కుమ నెంజమ్ (తమిళ సినిమా)- మార్చి 19
ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా)- మార్చి 21
రోడ్ హౌజ్ (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 21

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
పామ్ రాయల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20
ఆర్గిల్లీ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 23
ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- మార్చి 19
ఓపెన్ హైమర్ (ఆస్కార్ విన్నింగ్ మూవీ)- జియో సినిమా- మార్చి 21

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu