HomeOTTOTT లో ఈ వారం ఇన్ని సినిమాలు ఉన్నాయా?

OTT లో ఈ వారం ఇన్ని సినిమాలు ఉన్నాయా?

So many OTT releases this week to binge watch
So many OTT releases this week to binge watch

OTT releases this week:

ఆగస్టు నెల పూర్తి కాబోతోంది. ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏమీ హిట్ అవ్వలేదు. చిన్న సినిమాలు కావచ్చిన ఆయ్, కమిటీ కుర్రోళ్ళు, మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కన పెట్టేస్తే OTT లో ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఆహా:

ఆహాలో ఈ వారం మూడు తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

పురుషోత్తముడు (Purushottamudu):

ఈమధ్య వివాదాల ద్వారా బాగానే పాపులర్ అయిపోయిన రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు సినిమా ఈనెల 29వ తేదీన ఆహలో విడుదలకు రెడీ అవుతోంది.

సారంగ ధరియా (Saranga Dhariya):

సారంగ ధరియా అనే చిన్న బడ్జెట్ సినిమా కూడా ఆగస్టు 31వ తేదీన ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది.

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వారం ఆల్రెడీ మంజ్యూ అనే సూపర్ హిట్ హిందీ సినిమా విడుదల అయ్యి మంచి ఆదరణ అందుకుంటోంది.

 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

చైతన్య రావ్, హెబ్బ పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు బోల్డ్ మూవీ హనీమూన్ ఎక్స్ప్రెస్ థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

 

నెట్‌ ఫ్లిక్స్:

ఐసీ 814: ది కాంధార్ హైజాక్ (IC 814: The Kandahar Hijack):

1999 డిసెంబర్లో జరిగిన ఒక నిజ జీవిత హైజాక్ గురించి త్రిల్లింగ్ ఆ తీసిన వెబ్ సిరీస్ ఇది. ఈ హిందీ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఆగస్టు 29న విడుదల కాబోతోంది.

బడ్డీ (Buddy):

అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ఆగస్టులోనే విడుదలైంది. థియేటర్లలో యావరేజ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.

 

ఈటీవీ విన్:

షేడ్స్ ఆఫ్ బేబీ పింక్ అనే ఒక హార్డ్ హిట్టింగ్ తెలుగు సినిమా ఆగస్టు 29నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu