HomeTelugu Big Storiesఆ ఐదు సినిమాలపైనే ఆశ!

ఆ ఐదు సినిమాలపైనే ఆశ!

2017 ఏడాది మరికొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ ఏడాది చిన్నా పెద్దా మొత్తం కలుపుకుంటే 200 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయని తెలుస్తోంది. బాహుబలి2 వంటి ప్రపంచఖ్యాతి సాధించిన సినిమా విడుదలైంది ఈ ఏడాదే. ఎలాంటి అంచనాలు లేకుండా ‘అర్జున్ రెడ్డి’ అంటూ ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం పడింది కూడా ఈ ఏడాదే. అయితే దసరా కానుకగా విడుదలైన రెండు భారీ చిత్రాలు స్పైడర్, జైలవకుస మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. దీంతో మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సినిమాల విషయంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. 
మెజారిటీ సినిమాలకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో ఓ ఐదు సినిమాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాని నటించిన ‘ఎంసిఏ’, అఖిల్ ‘హలో’ సినిమా, ‘మాహానటి’, ‘ఎమ్మెల్యే’, ‘2 కంట్రీస్’. ఇప్పుడు వరుస పెట్టి ఈ సినిమాలు విడుదలకానున్నాయి. ఈ ఐదు చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. వరుస పరాజయల మీదున్న సునీల్ సినిమా కూడా అంచనాలను పెంచుతోంది. ఎందుకంటే మలయాళంలో హిట్టయిన సినిమాకు రీమేక్ గా ‘2 కంట్రీస్’ ను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ ఏడాది చివర్లో వస్తోన్న ఈ సినిమాలు ఏ మేరకు సత్తా చాటుతాయో చూడాలి!
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu