కౌశల్‌ని విన్నర్‌గా ప్రకటించిన బిగ్‌బాస్‌

బిగ్ బాస్ రెండో సీజన్-2 ఏదైనా జరగవచ్చు అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభమైంది. చెప్పినట్లుగానే హౌస్‌ లో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ తో పోలిస్తే బిగ్ బాస్ టాస్క్ ల్లో పదును పెరగటమే కాకుండా ఇంటి సభ్యులు కూడా చాలా సీరియస్ గా ఆడారు. దాదాపుగా 110 రోజులు జరిగిన బిగ్ బాస్ సీజన్-2 రేపటితో ముగియనుంది. రేపు జరిగే గ్రాండ్ ఫినాలే తో ముగుంపు పలుకుతారు. అయితే సోషల్ మీడియాలో కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అంటూ వైరల్ అయింది. ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కౌశల్ కి అత్యధికంగా ఓట్లు వచ్చాయని అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు కౌశల్‌ని బిగ్ బాస్ విజేతగా ప్రకటించారని ప్రచారం కొనసాగుతుంది.

కౌశల్ తర్వాతి స్థానం దీప్తి నల్లమోతు అని మూడో స్థానం గీతా మాధురి అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ అనే వినిపిస్తుంది. గ్రాండ్ ఫినాలేకి విక్టరీ వెంకటేష్ వచ్చాడని వెంకటేష్ చేతుల మీదుగా కౌశల్ ట్రోఫీ తీసుకున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగవలసిందే.