HomeTelugu Trending'ఆపరేషన్‌ వాలెంటైన్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Operation Valentine releaవరుణ్‌ తేజ్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్‌ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శక్తిప్రతాప్‌ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌ న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఈ క్ర‌మంలోనే మూవీ నుంచి ఒక‌ సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చింది. మొద‌ట ఈ మూవీని డిసెంబ‌ర్ 08న‌ విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వ‌ల్ల ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మ‌ళ్లీ ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఈ సినిమాను 2024 ఫిబ్ర‌వ‌రి 16న తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రానుంది.

వరుణ్ తేజ్ మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమా ‘మట్కా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu