HomeTelugu Trending20 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్

20 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్

20 Years Of NTR special pos

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తికావొస్తోంది. ఈ సందర్భంగా 20 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. బాల నటుడిగా రెండు సినిమాల్లో నటించినా ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఎన్టీఆర్ బాలనటుడిగా ‘బాల రామాయణం’ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో నటించాడు. బాల రామాయణం సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ విడుదల కాలేదు. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తికావస్తున్నందున కామన్‌ డీపీ ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్లను పొందుపరుస్తూ ఓ కాయిన్ రూపంలో కామన్ డీపీని తయారు చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu