HomeTelugu Trendingజనవరి 26 'హీరో'

జనవరి 26 ‘హీరో’

Release date of Mahesh Babu's nephew locked

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు ‘హీరో’గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి ‘దిల్’ రాజు నిర్మాతగా మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడటంతో ఇప్పుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ అతని తల్లిదండ్రులు గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ ‘హీరో’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన వియ్యపురాలు గల్లా అరుణ కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో జగపతిబాబు, నరేశ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సత్య, అర్చనా సౌందర్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘హీరో’ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 2022 జనవరి 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu