HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ పై ఫిర్యాదు..

అల్లు అర్జున్‌ పై ఫిర్యాదు..

A complaint against allu arస్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారని’ ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇదే విషయమై ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu