HomeTelugu Newsఫ్లాప్‌ హీరోయిన్‌కి భారీ ఆఫర్‌.. ఈసారైనా గాడిలో పడుతుందా?

ఫ్లాప్‌ హీరోయిన్‌కి భారీ ఆఫర్‌.. ఈసారైనా గాడిలో పడుతుందా?

pooja

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన పూజాహెగ్డేకు గత రెండేళ్లుగా పెద్దగా కలిసి రావడం లేదు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఈ అమ్మడుకి ఒక్క హిట్‌ కూడా రాలేదు. వరుస ఫ్లాప్స్‌తో ఉన్న కూడా పూజా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి తన స్టార్‌డమ్‌ని సాధిస్తాననే ధీమాతో ఉంది.

తాజా ఈ బ్యూటీకి రెండు భారీ ప్రాజెక్ట్‌లలో ఆఫర్లు వచ్చిన్నట్లు తెలుస్తుంది. ‘పుష్ప-2’ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. బన్నీకి కథ చెప్పానని, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని అట్లీ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్‌.

దీంతో పాటు.. నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తొలుత ఇందులో సమంతను హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్‌ తీసుకోవడంతో ఆమె స్థానంలో పూజాహెగ్డేను తీసుకున్నట్లుగా అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. పూజా కెరీర్‌ తిరిగి గాడిలో పడుతుంది అని ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu