HomeTelugu Trending'అహింస' సినిమా షూటింగ్‌ పూర్తి..

‘అహింస’ సినిమా షూటింగ్‌ పూర్తి..

Aabhiram movie Ahimsa movie
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోద‌రుడు అభిరామ్ హీరోగా.. డైరెక్ట‌ర్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తున్న‌ విషయం తెలిసిందే. ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ అందించారు మేక‌ర్స్. ‘అహింస’ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక తెలియ‌జేశారు. డైరెక్ట‌ర్ తేజ‌, హీరో అభిరామ్‌, హీరోయిన్ గీతికా అండ్ టీం లొకేష‌న్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్టు తెలియ‌జేశారు.

ఈ సినిమాలో స‌దా, క‌మ‌ల్ కామ‌రాజు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ నిర్మిస్తున్నారు. తేజ టీం త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నుంది. ఇప్ప‌టికే అభిరామ్ ఫస్ట్‌ లుక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ చిత్రంలో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu