HomeTelugu Trendingఆసక్తికరంగా ఆది కొత్త సినిమా పోస్టర్‌

ఆసక్తికరంగా ఆది కొత్త సినిమా పోస్టర్‌

Aadi Sai Kumar new movie po
టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్ వరుస చిత్రలతో బిజీగా ఉన్నాడు. కాగా ఈరోజు ఆది పుట్టినరోజు సందర్బంగా.. తనతో బ్లాక్ సినిమా తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు ఆ సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు. త్వరలో ఆది బ్లాక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నట్లు తెలుస్తుంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. బ్లాక్ ఒక
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తుంది.

చూస్తుంటే పోస్టర్ కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ఇందులో ఆది.. రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం విశేషం. ఒకవైపు నార్మల్ లుక్కుతో మరో వైపు సీరియస్ లుక్కుతో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా మహంకాళి బ్యానర్ పై.. కొత్త డైరెక్టర్‌ జి.బి. కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆది పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. దర్శన బానిక్ హీరోయినుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించ నున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu