HomeTelugu Trendingఆది సాయికుమార్‌ 'టాప్‌గేర్‌' ఫస్ట్‌లుక్‌

ఆది సాయికుమార్‌ ‘టాప్‌గేర్‌’ ఫస్ట్‌లుక్‌

Aadi saikumar new movie tit
టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న ఆరు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఆందులో శ‌శికాంత్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌బోయే సినిమా ఒక‌టి. థ్రిల్ల‌ర్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు.

ఈ చిత్రానికి ‘టాప్‌గేర్’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో ఆది క్యాబ్ న‌డిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంది. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్‌, శ్రీ ధ‌న‌ల‌క్ష్మీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కే.వి శ్రీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. రియా సుమ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో బ్ర‌హ్మాజీ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్న చిత్ర‌బృందం త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లు పెట్ట‌నున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu