HomeTelugu Trending'ఆదికేశవ' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘ఆదికేశవ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

aadikeshava new release dat
ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. PVT 4గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావల్సింది. కానీ విడుదల వాయిదా పడింది.

తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. కొన్ని విలువైన కథల కోసం నిరీక్షించే సమయం.. అంటూ నవంబర్ 10న ఆది కేశవను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ అప్‌డేట్ న్యూ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ మూవీలో బీస్ట్‌ ఫేం అపర్ణా దాస్ ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ -ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu