HomeTelugu Newsఆమని కుటుంబ కథా చిత్రం అమ్మ దీవెన

ఆమని కుటుంబ కథా చిత్రం అమ్మ దీవెన

13 11
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో ‘అమ్మ దీవెన’ అనే చిత్రం తెరక్కుతోంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను నటి జీవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఆమని మంచి నటి. రాజశేఖర్‌తో ‘అమ్మ కొడుకు’ మూవీలో నటించినప్పటి నుంచి నాకు పరిచయం. పెళ్లి తరువాత తాను మంచి
చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీలు తగ్గాయి. మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీస్తున్నారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు’ అన్నారు.

ఆమని మాట్లాడుతూ ‘శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గురువయ్య నిర్మిస్తున్నారు. మంచి సినిమాతో
ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన జీవిత సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. మగదిక్కు లేని కుటుంబంలో మహిళ ఐదుగురు పిల్లల్ని ఎలా చదివించింది? వారికి మంచి భవిషత్తు ఎలా ఇచ్చింది? అనేది ఈ సినిమా ప్రధానాంశం అని చెప్పారు. ఈసినిమాలో పోసాని కృష్ణ మురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu